నటుడు, దర్శకుడు సముద్రఖని తమిళంలో తెరకెక్కించిన వినోదయ సిత్తం అక్కడ ఘనవిజయం సాధించింది. తెలుగు భాషలో డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమా అతి త్వరలోనే తెలుగులో రీమేక్ కాబోతుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి ఫస్ట్ టైం ఈ తమిళ రీమేక్ లో నటించబోతున్నట్టు ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఐతే, ఆ తరవాత ఈ ప్రాజెక్ట్ అటకెక్కిందని కూడా వార్తలు వినిపించాయి.
తాజా బజ్ ప్రకారం, వినోదయ సిత్తం రీమేక్ చేసేందుకు మేనమామ - మేనల్లుడు ఇద్దరూ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. వచ్చే నెల 16/18 తారీఖుల్లో మొదలవబోతుందని టాక్. ఐతే, ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి అఫీషియల్ అప్డేట్ ఇవ్వకుండానే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తుందట. మరి, ఈ విషయంపై అఫీషియల్ క్లారిటీ ఎప్పుడొస్తుందో తెలియక... పవర్ స్టార్ ఫ్యాన్స్ కన్ఫ్యూషన్ లో మునిగిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa