సాధారణంగా సినిమా సెలబ్రిటీలు ఒకరు లేదా ఇద్దరు ఫ్యాన్స్ ఉంటే సెల్ఫీలు దిగుతారు. అంతకంటే ఎక్కువమంది అభిమానులు ఉంటే సెల్పీలకు నో చెబుతారు. కానీ కేజీఎఫ్ హీరో యష్ మాత్రం బెంగళూరులో జరిగిన ఓ ఈవెంట్ లో ఏకంగా 700 మంది అభిమానులతో వేర్పేరుగా సెల్ఫీలు దిగాడు. కాగా, గ్రూప్ సెల్ఫీ తీసుకోవాలని ఈవెంట్ నిర్వాహకులు సూచించినప్పటికీ యష్ మాత్రం అభిమానులతో వేర్వేరుగా సెల్ఫీలు దిగాడు. దీంతో యష్ సహనానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.