యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "వినరో భాగ్యము విష్ణుకథ". మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్లో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కాశ్మీర పరదేశీ హీరోయిన్ గా నటిస్తుంది.
తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసారు. డిసెంబర్ 24వ తేదీ సాయంత్రం 06:19 నిమిషాలకు ఈ సినిమా నుండి 'వాసవ సుహాస' పాటకు సంబంధించిన లిరికల్ వీడియో విడుదల కాబోతుందని తెలుపుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.
చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ గారు సమర్పిస్తున్నారు