మెగాస్టార్ చిరంజీవి గారి "వాల్తేరు వీరయ్య" సెకండ్ సింగిల్ 'శ్రీదేవి - చిరంజీవి' లిరికల్ వీడియో కొంతసేపటి క్రితమే విడుదలైంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరచి, సాహిత్యం అందించిన ఈ పాటను సింగర్స్ జస్ప్రీత్ జాస్, సమీరా భరద్వాజ్ కలిసి ఆలపించారు. స్క్రీన్ పై చిరు, శృతిల పెయిర్, కెమిస్ట్రీ సూపర్బ్ గా ఉంది. ఈ రాకింగ్ పెయిర్ యొక్క రాకింగ్ లవ్ మెలోడీ మెగా ఫ్యాన్స్ ను విశేషంగా అలరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
బాబీ కొల్లి డైరెక్షన్లో ఔటండౌట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కీరోల్ లో నటిస్తున్నారు. శృతి హాసన్, క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. పోతే, జనవరి 13న వాల్తేరు వీరయ్య థియేటర్లకు రాబోతున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa