కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార, విలక్షణ నటులు అనుపమ్ ఖేర్, సత్యరాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం "కనెక్ట్". మాయ, గేమ్ ఓవర్ సినిమాల దర్శకుడు అశ్విన్ శరవణన్ డైరెక్షన్లో హార్రర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ లో వినయ్ రాయ్, హనియా నఫీసా కీరోల్స్ లో నటించారు.పృథ్వి చంద్రశేఖరన్ సంగీతం అందించారు. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై విఘ్నేష్ శివన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషలలో రేపే ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. తెలుగులో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది.
కనెక్ట్ మూవీ టీజర్, ట్రైలర్ లకు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ రాగా, థియేటర్లలో ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఎలాంటి ఇంటర్వెల్ బ్రేక్ లేకుండా గంటా 39నిమిషాలపాటు ఒక ఇంటెన్స్ హార్రర్ థ్రిల్లర్ ను ఎక్స్పీరియన్స్ చెయ్యాలనుకుంటే...ఇంకెందుకాలస్యం రేపు కనెక్ట్ ను బిగ్ స్క్రీన్ పై చూసెయ్యండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa