సాయికుమార్, తారకరత్న, ప్రిన్స్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న చిత్రం "S 5 నో ఎక్జిట్". భరత్ కోమలపాటి డైరెక్షన్లో డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని శౌరి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అరుణ్ ప్రతాప్ రెడ్డి, గౌతమ్ కొండేపూడి, దేవు శామ్యూల్, షేక్ రహీం నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేసారు. ట్రైలర్ ఆద్యంతం స్ట్రైకింగ్ కంటెంట్ తో ఆకట్టుకుంటుంది. టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఎక్కువశాతం ట్రైన్ లో ఉండే S 5 భోగిలో జరుగుతుంది. హ్యాపీ గా సాగిపోతున్న రైలు ప్రయాణంలో ప్రయాణికులు ఎదుర్కొన్న భయంకర పరిస్థితులు, సడెన్ గా డోర్స్ లాక్ అవ్వడం, మనుషులు మాయమవడం, దీంతో ప్రయాణికులు భయాందోళనలకు లోనవ్వడం.. ఈ క్రమంలో పాత్రల మధ్య ఏర్పడే కామెడీతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
అవంతికా హరి, అలీ, సునీల్, సురేష్ వర్మ, మెహబూబ్, రఘు, సంజయ్, ఫిష్ వెంకట్, రమణ రెడ్డి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పోతే, డిసెంబర్ 30వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa