ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రా సీఎం తో కోలీవుడ్ హీరో మీటింగ్.. ఎందుకంటే..?

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 21, 2022, 07:57 PM

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కు తెలుగు ఆడియన్స్ లో మంచి పాపులారిటీ ఉంది. రేపే.. విశాల్ నటిస్తున్న "లాఠీ" మూవీ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో విశాల్ గురించిన ఆసక్తికర విషయమొకటి ప్రచారంలోకొచ్చింది.


లాఠీ ప్రమోషన్స్ లో భాగంగా తిరుపతి, చిత్తూరులో భీకర ప్రమోషన్స్ చేసారు విశాల్. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా నుండి విశాల్ ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికలలో పాల్గొంటారని ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది. అంతేకాక ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. తనకు ఏపీ సీఎం శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. తాజాగా ఈ నెల 27న జగన్ తో విశాల్ భేటీ కానున్నారని తెలుస్తుంది. మరి, ఈ మీటింగ్ వెనుకనున్న అసలు కారణం/ రహస్యం.. ఏంటి అన్నది ఇంకా బయటకు రాలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa