ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా లో బాలకృష్ణ కెరీర్ రికార్డు

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 09, 2019, 01:04 PM

దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'కథానాయకుడు' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి సినీ అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. మరోవైపు, అమెరికాలో నిన్ననే ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ ఉదయం వరకు వేసిన షోలతో ఈ చిత్రం 4,40,000 డాలర్లను (రూ. 3,09,87,000) కొల్లగొట్టింది. ఈ క్రమంలో బాలయ్య మరో చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' రికార్డును బద్దలు కొట్టింది. 'శాతకర్ణి' సినిమా ప్రీమియర్ షో ద్వారా తొలి రోజు రూ. 3,75,000 డాలర్లు (రూ. 2,64,14,812) వసూలు చేసింది. ఆ రికార్డును 'కథానాయకుడు' అధిగమించింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa