మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నేటితో ఎనిమిదేళ్ల సినీ కెరీర్ ను ముగించుకున్నారు. ఆయన హీరోగా నటించిన తొలి సినిమా "ముకుందా" 2014లో సరిగ్గా ఇదే రోజు విడుదలైంది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. లియో ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు నిర్మించారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, నాజర్ కీరోల్స్ లో నటించారు.
ఈ ఏడాది వరుణ్ తేజ్ నుండి F 3, గని సినిమాలు రాగా అందులో F 3 మాత్రమే ప్రేక్షకుల మెప్పును సొంతం చేసుకుంది. పోతే, ప్రస్తుతం వరుణ్ VT 12, VT 13 సినిమాల షూటింగులతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa