పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో చాలా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. కొన్నాళ్ళబట్టి తనలోని రచయితను, నటుడిని చూపిస్తూ ప్రేక్షకులను అలరించిన తరుణ్ భాస్కర్ మళ్ళీ తనకిష్టమైన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కే వచ్చేసారు. ఆయన డైరెక్షన్లో తాజాగా రూపొందుతున్న చిత్రం "కీడా కోలా".
వీజీ సైన్మా బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కబోతున్న ఈ మూవీ షూటింగ్ కొన్నిరోజుల నుండి నిరవధికంగా జరుగుతున్న విషయం తెలిసిందే. రీసెంట్గానే తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా సెకండ్ షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. శ్రీపాద్ నందిరాజ్, సాయికృష్ణ గద్వాల్, ఉపేంద్ర వర్మ, వివేక్, కౌశిక్ నండూరి నిర్మిస్తున్న కీడా కోలా 2023లో పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది.