ఏఆర్ మోహన్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ నటించిన 'ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం' చిత్రం గ్రాండ్ గా నవంబర్ 25న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో శ్రీదేవి సోడా సెంటర్ ఫేమ్ ఆనంది కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ నిZEE5 సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ 23, 2022న ZEE5లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంటుంది.
తాజగా ఇప్పుడు, ఈ చిత్రం ప్రస్తుతం ZEE5 ఇండియాలో అగ్రస్థానంలో నిలిచింది. అల్లరి నరేష్ ఈ సినిమాలో ఎలక్షన్ డ్యూటీపై గ్రామానికి వెళ్లే స్కూల్ టీచర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత అందిస్తుండగా, హాస్య మూవీస్ అండ్ జీ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa