కోమలి ఫేమ్ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన 'లవ్ టుడే' సినిమా తమిళనాడు బాక్సాఫీస్ వద్ద విడుదలైన అనతికాలంలోనే 70 కోట్ల మార్క్‌ను దాటింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ తెలుగు-డబ్బింగ్ వెర్షన్ నవంబర్ 18, 2022న గ్రాండ్ గా విడుదల చేయగా ఈ రొమాంటిక్ కామెడీ తెలుగుబాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.
రొమాంటిక్ కామెడీ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ సరసన ఇవానా జంటగా నటించారు. సత్యరాజ్, రాధికా శరత్‌కుమార్, యోగి బాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మించింది.
ప్రముఖ నిర్మాత బోనీకపూర్ ఈ సినిమా రీమేక్ రైట్స్ ని కొనుగోలు చేశారని, బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్‌తో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నాడని సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రానికి దావిద్ ధావన్ దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందో లేదో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa