'వారిసు' సినిమా కోసం తలపతి విజయ్ అభిమానులు ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. వారి కుతూహలాన్ని రెట్టింపు చేసి, సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూసేలా చేసేందుకు వారిసు మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేస్తున్నారు. మరికాసేపట్లోనే అంటే సాయంత్రం ఐదింటికి వారిసు/ వారసుడు ట్రైలర్ విడుదల కాబోతుంది. ఈ ట్రైలర్ పై తలపతి అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. మరి, ఫ్యామిలీ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ యొక్క ట్రైలర్ అభిమానుల అంచనాలను అందుకోవడంతో ఏమేరకు విజయవంతమవుతుందో చూడాలి.
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో విజయ్, రష్మిక మండన్నా జంటగా నటిస్తన్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు. పొంగల్ 2023 కానుకగా తమిళ, తెలుగు భాషలలో ఏకకాలంలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa