వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఫ్యామిలీ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న సినిమా "వారిసు". తెలుగులో 'వారసుడు' గా రాబోతుంది. కొంతసేపటి క్రితమే వారసుడు ట్రైలర్ విడుదలయ్యింది. ట్రైలర్ ఆద్యంతం ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా సాగింది. మొత్తానికి ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి థియేటర్లలో పండగ చేసుకునే సినిమా వారసుడు అని ట్రైలర్ ను బట్టి క్లియర్ గా తెలుస్తుంది.
ఈ సినిమాలో విజయ్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్, జయసుధ, శరత్ కుమార్, శ్రీకాంత్, శామ్, సంగీత ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa