సంక్రాంతి ముందు అటు థియేటర్, ఇటు ఓటీటీలో సినిమాలు, వెబ్‌సిరీస్‌ల సందడి నెలకొంది. జనవరి 6న అడవి శేష్, మీనాక్షి చౌదరి నటించిన హిట్ 2 అమెజాన్ ప్రైమ్‌లో, అమితాబ్ కీలక పాత్రలో నటించిన ఊంచాయ్ జీ5లో రానుంది. ప్రభాస్, గోపిచంద్ ఎపిసోడ్ ఆహాలో 6న స్ట్రీమ్ కానుంది. అలాగే ఈవారం నెట్‌ఫ్లిక్స్‌లో నాయి శేఖర్ రిటర్న్స్, ఉమెన్ ఆఫ్ ది డెడ్, జిన్నీ అండ్ జార్జియా, పేల్ బ్లూ ఐ, థాయి మసాజ్, ప్రెజర్ కుక్కర్, ది అల్టిమేటం, సందడి చేయనున్నాయి. తాజా ఖబర్, ది ఫైల్స్ ఆఫ్ యంగ్ కిందాయ్‌చి, ది మెనూ.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రానున్నాయి. విక్రమ్ వేద వూట్‌లో ప్రసారం కానుంది.