ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి గారు "వాల్తేరు వీరయ్య" గా, నటసింహం నందమూరి బాలకృష్ణ గారు "వీరసింహారెడ్డి" గా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్న విషయం తెలిసిందే. ముందుగా అంటే జనవరి 12న బాలయ్య థియేటర్లకు రాబోతుండగా, ఆ వెంటనే జనవరి 13న చిరు ఎంట్రీ ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఒక తియ్యటి వార్త చేరిందని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు సినిమాల టికెట్ రేట్లను రూ. 45/- లు పెంచుకునే వెసులుబాటును కల్పించిన ఏపీ గవర్నమెంట్ అతి త్వరలోనే ఇందుకు సంబంధించిన జీవో ను విడుదల చెయ్యబోతుందంట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa