ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ "వారిసు" ...రేపే గ్రాండ్ రిలీజ్..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 10, 2023, 06:44 PM

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్, నేషనల్ క్రష్ రష్మిక మండన్నా జంటగా, వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ "వారిసు". ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాతోనే కోలీవుడ్ నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్నారు.


ప్రమోషనల్ కంటెంట్ తో వారిసు పై ప్రేక్షకాభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. భారీ అంచనాల నడుమ రేపే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.


థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, సుమన్, ప్రభు, శ్రీకాంత్, సంగీత, శామ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. పోతే, తెలుగులో ఈ సినిమా "వారసుడు" గా జనవరి 14న విడుదల కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa