నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న కొత్త సినిమా టైటిల్ లీక్ కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులకు పాల్పడిన వ్యక్తులు ఎవరో తనకు తెలుసని అన్నారు. తన టీమ్‌తో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘‘నా సినిమాకే కాదు.. ఏ సినిమాకేౖనా లీకుల బెడద ఉంటే.. అసిస్టెంట్ డైరెక్టర్స్, రచయితలను తప్పుపట్టడం మానేస్తే మంచిది. సినీ రంగానికి సంబంధించి రాబోయే తరం క్రియేటర్స్ వాళ్లు. సినిమా రంగానికి వారు అందించే నిస్వార్థమైన సేవలనును గౌరవించాలి. కష్టపడి పనిచేసే డిపార్ట్మెంట్లపై నిందలని వేసే అలవాట్లను మార్చుకోండి.
నా సినిమా టైటిల్‌ను లీక్ చేసిన వ్యక్తులెవరో నాకు తెలుసు. వాళ్లు నా టీమ్‌లో వారైతే కాదు’’ అని అన్నారు. శ్రీకాంత్ ‘దసరా’తో దర్శకుచిడిగా పరిచయమయ్యారు. నాని హీరోగా నటించిన ఈ సినిమా గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. తొలి ప్రయత్నంలోనే శ్రీకాంత్ అద్భుతంగా సినిమా తెరకెక్కించారని సినీ ప్రియులు మెచ్చుకున్నారు. వీరిద్దరి కాంబోలో ఇటీవల కొత్త సినిమా పట్టాలెక్కింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రానికి ‘ది ప్యారడైజ్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. చిత్రబృందం ప్రకటించేలోగా టైటిల్ లీక్ కావడంపై టీమ్ అసహనం వ్యక్తం చేసింది.