బస్సు టికెట్ ధరలను 15% పెంచేందుకు కర్ణాటక క్యాబినెట్ ఆమోదం తెలిపింది. KSRTCలో జనవరి 5 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని మంత్రి HK పాటిల్ తెలిపారు.
రేట్లు పెంచినా ఏపీ, తెలంగాణ కంటే ఛార్జీలు తక్కువగా ఉంటాయన్నారు. కాగా, కర్ణాటకలో మహిళలకు ఫ్రీ బస్ స్కీంవల్ల నెలకు రూ.417కోట్లు ఖర్చవుతోంది. తాజాగా రేట్ల పెంపుతో రోజుకు రూ.7.84కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది.