తెలుగు హీరో సందీప్ కిషన్ ప్రధానపాత్రలో తమిళ, తెలుగు భాషల్లో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరో కాదు... తమిళ అగ్ర హీరో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్. సాధారణంగా హీరోల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చేందుకే ఆసక్తి చూపిస్తుంటారు. కానీ, అందుకు భిన్నంగా విజయ్ తనయుడు జాసన్ సంజయ్ మెగా ఫోన్ పట్టుకున్నాడు. లైకా ప్రొడక్షన్స్ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. సందీప్ కిషన్ ను హీరోగా ఎంపిక చేసుకోవడం ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ హైప్ క్రియేట్ అయింది. తాజాగా ఈ సినిమా గురించి లైకా ప్రొడక్షన్స్ నుంచి అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ సందర్భంగా మూవీ మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఇతర తారాగణం గురించి ప్రకటన వెలువడనుంది. ఈ చిత్రం 2025 జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది.