యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను నటించిన ‘లీలా వినోదం’ ప్రమోషనల్ ఈవెంట్‌లో ఎమోషనల్ అయ్యి మాట్లాడారు. ‘ఎవరో చేసిన తప్పుకి నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నా తల్లిదండ్రులని, అభిమానుల్ని చాలా బాధపెట్టాను. దయచేసి క్షమించండి. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి ‘లీలా వినోదం’ ప్రాజెక్ట్ వచ్చింది. కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చిన వాళ్లే నిజమైన మిత్రులని తెలుసుకున్నా.’ అని అన్నారు.సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య వంటి వెబ్ సిరీస్‌లతో యూట్యూబ్‌లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ దక్కించుకున్నాడు జస్వంత్. ఇప్పుడు ఓటీటీ కోసం ' లీల వినోదం' చిత్రంలో ఆయన నటించారు. డిసెంబర్ 19 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన ఘటనలను మీడియాతో పంచుకున్నాడు.స్టేజీపైనే షణ్ముఖ్ జస్వంత్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా మాట్లాడారు. నా జర్నీ అంతా మొదట వైజాగ్‌లోనే ప్రారంభమైంది. ఆ సమయంలో నా కెరీర్ ఎటు పోతుందో తెలియని అర్థం కాని పరిస్థితిలో నేను ఉన్నాను. అప్పుడు హైదరబాద్‌కు వచ్చి కొన్ని కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు చేసుకున్నాను. మంచిగానే సక్సెస్ అయ్యాను. కానీ, ఎవరో చేసిన తప్పుకు నన్ను బ్లేమ్ చేస్తూ అనేక ఆరోపణలు చేశారు. ఆ చెడ్డ పేరు నాకు మాత్రమే ఆపాదించకుండా.. ఇందులోకి నా కుటుంబాన్ని కూడా లాగారు. ఫ్యామిలీకి అండగా ఉండాలని ప్రతి కుమారుడు అనుకుంటాడు.