డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ వారం ఒక అప్డేట్ వస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే విష్ణు మంచు తన చిత్రం నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్‌ను వదులుతున్నారు. సినిమాలోని విభిన్న పాత్రలను పోషించిన దిగ్గజ నటీనటుల పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. అయితే ఈసారి కన్నప్ప యానిమేటెడ్ కామిక్ బుక్స్ రూపంలో మరో వైవిధ్యమైన ప్రమోషన్స్‌కి శ్రీకారం చుట్టారు.డిసెంబర్ 23న కన్నప్ప యానిమేటెడ్ కామిక్ బుక్- 1 పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు. అద్భుతమైన భక్తి రసాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించే సినిమా కన్నప్ప అంటూ మొదలైన ఈ వీడియోలో... అసలు, కన్నప్ప ఎవరు? అనే విషయాన్ని వెల్లడించారు. AI టెక్నాలజీ ఉపయోగించి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఈ వీడియో వదిలారు. మొత్తం 5 భాగాలలో విడుదలైన కన్నప్ప కామిక్ ఆడియో బుక్ మొదటి భాగం ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.భక్తికి, త్యాగానికి పరమార్థం చెప్పిన సినిమా ఇది అంటూ కన్నప్ప టీమ్ పేర్కొంది. మానవత్వానికి, దైవత్వానికి ఉన్న అనుబంధాన్ని చెప్పేదే ఈ సినిమా అంటూ ఈ వీడియో ద్వారా కన్నప్ప మూవీపై మేకర్స్ అంచనాలు పెంచేశారు. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడికి భక్తితో సమర్పించుకుంటున్న కానుక ఇది అని తెలిపారు. ఆడియన్స్ లో ఆసక్తి పెంచేలా ఈ వీడియోలో విజువల్స్, యానిమేషన్ క్లిప్స్ ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ యానిమేటెడ్ కామిక్ బుక్ కన్నప్పపై హైప్ పెంచేసింది. కన్నప్ప కథ తెలియని వారికి కూడా ఈ సినిమా కథని సూచన ప్రాయంగా తెలిపి ఆకట్టుకున్నారు. కన్నప్ప చిత్రంలో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వంటి స్టార్ కాస్ట్ నటించారు. సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా కన్నప్ప మూవీ రాబోతోంది. ఎంతో అంకితభావంతో విష్ణు మంచు కన్నప్ప పాత్రను పోషిస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. అతి త్వరలో ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది.