బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంది. కపూర్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ వివాహం తర్వాత సెలెక్టివ్‌గా మూవీస్ చేస్తోంది. వెండితెరపై అరుదుగా కనిపించినా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. అప్పుడప్పుడు ఫోటోషూట్స్ చేస్తూ ఫాలోవర్స్‌ని పెంచుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనమ్.. తన వ్యక్తిగత, ప్రొఫిషినల్ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. కొడుకు పుట్టిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని సోనమ్ చెప్పుకొచ్చింది. ‘తల్లి అవ్వడం అనేది నన్ను పూర్తిగా మార్చేసింది. అది మహిళలకు శారీరికంగా, మానసికంగా.. అన్ని రకాలుగా మార్చేస్తుంది. అసలు ముందు ఉన్న మనిషి కాదేనే అనిపించేస్తుంది.ప్రతి తల్లికి పిల్లలే మొదటి ప్రాధాన్యత అవుతారు. నా కొడుకు బాగోగులు చూసుకోవడమే నాకు ముఖ్యం. ఆ తర్వాతే సమయం ఉంటేనే సినిమాలు చేస్తా’ అని సోనమ్ చెప్పుకొచ్చింది. భర్త, పిల్లలే నా ప్రపంచం. సినిమాల్లో కూడా నటిస్తాను. మనిషిగా మనం ఎదిగేలా చేసేవారితోనే ఎక్కువగా పనిచేస్తాను. ఒకరు నాకు నచ్చకపోతే వారితో కలిసి పనిచేయడం చాలా కష్టం. నేను ఎలాంటి కథలు ఎంపిక చేసుకుంటున్న అనే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను’ అని సోనమ్ చెప్పుకొచ్చింది.
![]() |
![]() |