లారెన్స్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన హారర్ కామెడీ చిత్రాల్లో ‘కాంచన’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. మూడు భాగాలుగా వచ్చిన ఈ హారర్ కామెడీ మూవీ లారెన్స్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. అయితే ఇప్పుడు కాంచన-4 సైతం రెడీ అవుతుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో స్టార్ట్ అయింది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల షూటింగ్‌లో కూడా పాల్గొన్నట్లు సమాచారం.దిల్బర్ పాటతో పాన్ ఇండియా సినీ ప్రపంచంలో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది నోరా ఫతేహి. ఆ తర్వాత హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ అమ్మడు గ్లామర్ స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్. తెలుగులోనూ పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ ద్వారా అలరించింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు కాంచన 4లో భాగం కానున్నట్లు తెలుస్తోంది. లారెన్స్ రాఘవ స్వీయదర్శకత్వంలో వచ్చిన కాంచన సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa