యాటిట్యూడ్ స్టార్ చంద్ర హాస్ రాబోయే చిత్రం 'బరాబర్ ప్రేమిస్తా' లో కనిపించనున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ అయిన మేగ్నా ముఖర్జీ ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, అర్జున్ మహి ప్రతినాయకుడిగా నటించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ మూవీ పై భారీ హైప్ ని క్రియేట్ చేసింది. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని రెడ్డి మామ అనే టైటిల్ తో రేపు అంటే ఫిబ్రవరి 22న ఉదయం 10:11 గంటలకి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియాజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. సంపత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కాకర్ల సత్యనారాయణ సమర్పణలో CC క్రియేషన్స్ మరియు AVR మూవీ వండర్స్ పతాకాలపై గేద చందు, గాయత్రి చిన్ని మరియు AVR నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa