ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటించిన కన్నడ చిత్రం 'రాక్షస'. లోహిత్ హెచ్ దర్శకత్వంలో టైమ్ లూప్ హారర్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఫిబ్రవరి 28న ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగులోనూ విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే అనివార్యంగా ఈ మూవీ రిలీజ్ వారం వెనక్కి వెళ్ళింది. మార్చి 7న 'రాక్షస'ను రెండు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. గతంలో శివరాజ్ కుమార్ నటించిన 'వేద' చిత్రాన్ని విడుదల చేసిన ఎంవీఆర్ కృష్ణ 'రాక్షస' ట్రైలర్ నచ్చి తెలుగు రైట్స్ ను దక్కించుకున్నారు. ఈ మూవీలో అరుణ్ రాథోడ్, శ్రీధర్, గౌతమ్, సోమశేఖర్, విహాన్ కృష్ణ తదితరులు ప్రధానపాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa