సౌత్‌లో హిట్ సాధించిన చాలా చిత్రాలు ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతున్నాయి. తాజాగా డియర్ కామ్రేడ్ చిత్రాన్ని బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు . రీసెంట్‌గా విజయ్ తో పాటు చిత్ర నిర్మాతలతో కలిసి చిత్రాన్ని వీక్షించిన ఆయన ఇదొక గొప్ప ప్రేమ కథ. మంచి సందేశం ఉంది. నటీనటులతో పాటు నిర్మాణ విలువలు బాగున్నాయి. ధర్మ ప్రొడక్షన్స్ సంస్థపై ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాననే విషయం తెలపడం ఆనందంగా ఉందని చెప్పాడు. అయితే హిందీ రీమేక్‌లో ప్రధానపాత్రలు ఎవరు పోషిస్తారు అనే దానిపై అభిమానులలో పలు ఆలోచనలు మెదులుతుండగా ఓ ఆసక్తికర వార్త బయటకి వచ్చింది. దఢఖ్ పెయిర్ ఇషాన్, జాన్వీ కపూర్ రీమేక్ చిత్రంలో హీరో హీరోయిన్‌లుగా నటిస్తారని సోషల్ మీడియాలో పలు వార్తలు పుట్టుకొస్తున్నాయి . దఢఖ్ చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి ప్రశంసలు లభించడంతో కరణ్ జోహార్ డియర్ కామ్రేడ్ రీమేక్ చిత్రంలో వారిద్దరిని ఎంపిక చేశాడట. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa