టాలీవుడ్ నటుడు నితిన్ దర్శకుడు శ్రీరామ్ వేణులతో ఒక ఎంటర్‌టైనర్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'తమ్ముడు' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కాంతారా ఫేమ్ సప్తమి గౌడ 'తమ్ముడు' సినిమాతో టాలీవుడ్‌లో లీడ్ రోల్‌లో నటిస్తోంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి మూడ్ అఫ్ తమ్ముడు అనే వీడియోని మే 12న సాయంత్రం 4:05 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. పూర్తి స్థాయి ప్రమోషన్లు త్వరలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. సీనియర్ నటి లయా ఈ చిత్రంలో నితిన్ సోదరిగా నటిస్తున్నారు, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలో నటిస్తుంది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రం జూలై 4, 2025న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa