భారతదేశంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అయిన ZEE5, మరో పవర్ ఫుల్ లీగల్ డ్రామాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. విమర్శకుల ప్రశంసలు పొందిన మలయాళీ సినిమా ‘J.S.K - జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ’ ఆగస్టు 22 నుంచి తెలుగులో ప్రసారం కానుంది. ఈ సినిమా ఇప్పటికే తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.ప్రముఖ నటులు సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించారు. లైంగిక వేధింపులకు గురైన జానకి విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్), న్యాయవాది డేవిడ్ అబెల్ డోనోవన్ (సురేష్ గోపి) సహాయంతో న్యాయం కోసం చేసే పోరాటమే ఈ సినిమా కథాంశం. ఈ చిత్రం న్యాయం, పోరాటం, విజయం వంటి అంశాలను ఆసక్తికరంగా చూపుతుంది.ఈ సినిమాకు గిరీష్ నారాయణన్ సంగీతం, గిబ్రాన్ నేపథ్య సంగీతం అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ వీకెండ్‌లో థ్రిల్లింగ్ కోర్ట్ డ్రామాను ఆస్వాదించాలనుకునే వారికి ఈ సినిమా ఒక మంచి ఎంపిక. ZEE5 లో ఈ సినిమాను ఆగస్టు 22 నుండి చూడవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa