మోలీవుడ్ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం 'కాంత' పై పనిచేస్తున్నాడు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భగ్యాశ్రీ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కాంత ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ యొక్క చివరి దశలో ఉంది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం అక్టోబర్ మూడవ వారంలో విడుదల కానున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజులలో ఈ విషయం పై క్లారిటీ రానుంది. తమిళ నటుడు సముథిరాకని ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంయుక్తంగా రానా యొక్క స్పిరిట్ మీడియా మరియు దుల్కర్ సల్మాన్ యొక్క వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa