by Suryaa Desk | Mon, Dec 23, 2024, 03:31 PM
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ బాక్సాఫీస్ లెక్కలను మార్చేస్తోంది. మూడో వారం ఎండ్ కాకముందే ఏకంగా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే అనేక రికార్డులను బద్ధలు కొట్టిన అల్లు అర్జున్ తన పేరిట కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో 18వ రోజు పుష్ప 2 ఎన్ని కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టిందో ఒకసారి పరిశీలిస్తే : '' 100 కోట్లు ఇచ్చినా చేయను .. కొడుకు కోసం ఆ డైరెక్టర్ బలవంతం చేశాడు '' నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. పుష్ప 1 భారీ బ్లాక్ బస్టర్ కావడంతో పుష్ప 2 ది రూల్ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూసింది. పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను బట్టి నార్త్ ఇండియాలో పుష్ప 2 మేనియాను అర్ధం చేసుకోవచ్చు. జాతరలో అల్లు అర్జున్ గెటప్, టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. దీంతో పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేక్‌ల్లా అమ్ముడయ్యాయి. దీంతో భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే తొలిసారిగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది పుష్ప 2. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైన ఈ సినిమాకు రూ.1200 కోట్ల గ్రాస్, రూ. 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా విలువ కట్టారు . అంచనాలను నిజం చేస్తూ తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లను ఫినిష్ చేశాడు అల్లు అర్జున్. తద్వారా దంగల్, బాహుబలి 2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఈ జోరు ఇలాగే కొనసాగితే లాంగ్ రన్‌లో రూ. 2000 కోట్లను పుష్ప 2 అవలీలగా దాటేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మూడో వారంలో వర్కింగ్ డేట్స్‌లో కాస్త డల్ అయిన పుష్ప 2 .. వీకెండ్‌లో మాత్రం దుమ్మురేపుతోంది. 18వ రోజైన ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో రూ.6.17 కోట్లు, హిందీలో రూ. 28 కోట్లు, తమిళనాడు, కర్ణాటక, కేరళ + రెస్టాఫ్ ఇండియాలలో రూ. 1.24 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. కోటి చొప్పున మొత్తంగా రూ.37 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆదివారం నాటి వసూళ్లతో కలిపి పుష్ప 2 .. 18 రోజుల వరకు రూ.1530 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఫాస్టెస్ట్‌గా రూ. 1500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప నిలిచింది. బాహుబలి 2 .. 23 రోజుల్లో ఈ మార్క్‌ను చేరుకోగా పుష్ప 2 కేవలం 18 రోజుల్లోనే రూ.1500 కోట్లను రాబట్టింది. ప్రస్తుతం థియేటర్‌లలో ముఫాసా : ది లైన్ కింగ్, విడుదల 2, బచ్చలమల్లి వంటి సినిమాలు ఉన్నప్పటికీ పుష్ప 2 తన ప్రభంజనం కొనసాగిస్తోంది. ఆదివారం నుంచి క్రిస్మస్ సెలవులు మొదలు కావడంతో అల్లు అర్జున్ మూవీకి ప్లస్ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
Latest News