by Suryaa Desk | Thu, Dec 26, 2024, 07:35 PM
కరోనా సమయంలో రూ.కోట్లలో దానం చేసి తాను రీల్ హీరో కాదు రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూ సూద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘పలు పొలిటికల్ పార్టీలు నన్ను పిలిచి సీఎం పదవీని, డిప్యూటీ సీఎం పదవీని ఆఫర్ చేశాయి. అయితే నేను వాటన్నింటికి నో చెప్పాను.’ రాజకీయాల్లో చేరి ఎవరికో జవాబుదారీగా ఉండాల్సిన అవసరం నాకు లేదు అని సోనూసూద్ స్పష్టం చేశారు.అంతేకాదు.. ఎంతో మంది పేదలకు ఆహారాన్ని పంచిపెట్టారు. సొంత ఆస్తులను తాకట్టు పెట్టి మరీ ప్రజలకు సాయం చేశారు. అప్పటిదాగా విలన్ ఇమేజ్ ఉన్న సోనూ సూద్.. ఒక్కసారిగా హీరో అయిపోయారు. తాజాగా నటిస్తున్న ఫతే మూవీ విడుదల కానున్న నేపథ్యంలో.. ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఓ షాలో పొలిటికల్ ఎంట్రీ ముచ్చటించారు.
Latest News