|
|
by Suryaa Desk | Sat, Nov 01, 2025, 08:38 AM
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం థియరీ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రారంభమై మార్చి 18న ముగుస్తాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి 21వ తేదీ వరకు జరుగుతాయి. ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.ఈసారి ఇంటర్ విద్యా విధానంలో బోర్డు ఒక కీలక మార్పు చేసింది. ఇప్పటివరకు కేవలం సెకండియర్ విద్యార్థులకు మాత్రమే నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలను ఈసారి ఫస్టియర్ విద్యార్థులకు కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫస్టియర్ విద్యార్థులకు జనవరి 21న ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష, జనవరి 23న ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్, జనవరి 24న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించనున్నారు.