|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 12:49 PM
పశ్చిమ బెంగాల్‌లోనూ విజయం సాధిస్తామని బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్ ధీమా వ్యక్తంచేశారు. భవిష్యత్తులో జేపీ నడ్డా స్థానంలో ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. తాజా నియామకం అనంతరం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నితిన్ మాట్లాడారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే తన ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు."కేంద్ర నాయకత్వం మాపై ఉంచిన నమ్మకంతో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తాను" అని నితిన్ నబిన్ తెలిపారు. వచ్చే ఏడాది జరగనున్న బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రస్తావించగా, బెంగాల్‌లోనూ తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. "మా సంస్థాగత నిర్మాణం కింది నుంచి పై వరకు చాలా బలంగా ఉంది. అందుకే బెంగాల్‌లో కూడా మేం గెలుస్తాం" అని పేర్కొన్నారు.