|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 02:55 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పెట్ బషీరాబాద్ లో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని, తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టేందుకు ఎమ్మెల్యే గురువారం తన నివాసంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈ సందర్భంగా రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, పింఛన్లు, ఇళ్ల పట్టాలు, ఆరోగ్యం, పారిశుద్ధ్యం వంటి వివిధ సమస్యలపై ప్రజలు వినతిపత్రాలు అందజేశారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు.