|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 10:28 AM
కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న విత్తన చట్టం-2025లో రైతు ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కల్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు కాలపరిమితితో కూడిన పరిహారం అందించాలని, అత్యధిక దిగుబడి ఆధారంగా పరిహారం లెక్కించాలన్నారు. ఈ ముసాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేర్చాల్సిన అంశాలు, అభ్యంతరాలపై తుది నివేదిక రూపకల్పనకు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.