|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 02:46 PM
TG: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్‌లో విచిత్ర ఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ వృద్ధ ఓటర్, బాక్స్‌లో వేయాల్సిన బ్యాలెట్ పేపర్లను మింగేశాడు. పరిస్థితి గమనించిన పోలింగ్ అధికారులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అతన్ని వెంటనే పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.