|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 08:40 PM
ఉమ్మడి జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారంపై ఐటీడీఏ పల్స్ యాప్ ద్వారా నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని ఇన్ఛార్జ్ పీవో యువరాజ్ తెలిపారు. విద్యార్థులకు కామన్ డైట్ మెనూ సక్రమంగా అమలు చేయడాన్ని పర్యవేక్షించేందుకు ఈ యాప్ ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు యాప్ సమర్థంగా వినియోగిస్తూ ఫొటోలు, వివరాలు అప్లోడ్ అవుతున్నాయన్నారు.