|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 12:30 PM
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన రోజైన డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా విజయ్ దివస్ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి, అంబేద్కర్ మరియు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన వారిని స్మరించుకున్నారు.