|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 02:56 PM
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలింగ్ సమయం ముగిసినప్పటికీ, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ పూర్తికావాల్సి ఉన్నా, చాలా మంది ఓటర్లు క్యూలో ఉండటంతో ఓటింగ్ ఆలస్యమైంది. ఒంటిగంట వరకు కేంద్రానికి వచ్చిన ఓటర్లకు అధికారులు ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం లైన్ లో ఉన్న ఓటర్లు ఓటు వేయడానికి సాయంత్రం 5గంటల వరకు సమయం పట్టవచ్చని అంచనా. ఉమ్మడి జిల్లాలో ఒంటిగంట వరకు 84.2% ఓటింగ్ నమోదైనట్లు, 10-12% ఓటర్లు ఇంకా క్యూలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.