|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 11:04 AM
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను పార్టీలకతీతంగా ఐక్యంగా గెలిపించాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీసీలను మోసం చేసిన రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే, బీసీలకు రాజకీయ అధికారం దక్కాలంటే ఈ ఎన్నికల్లో “బీసీల ఓటు బీసీలకే” నినాదంతో బీసీ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని ఆయన అన్నారు. జీవో 9 ప్రకారం రావాల్సిన 5380 సర్పంచ్ స్థానాలను జీవో 46 ద్వారా బీసీ రిజర్వేషన్లు 17%కి తగ్గించి, 3,400 స్థానాలను జనరల్‌గా మార్చి అన్యాయం చేశారని గౌడ్ విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో 90% బీసీ–ఎస్సీ–ఎస్టీలు నివసిస్తున్న నేపథ్యంలో, ఈ ఎన్నికలు బహుజన రాజకీయ చైతన్యానికి మార్గం చూపేలా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఐక్యంగా బీసీ అభ్యర్థులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.