|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 04:33 PM
రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని తెలిపారు. శాంతిభద్రతలపై పోలీసులు దృష్టి సారించారని, పోలింగ్ అనంతరం కౌంటింగ్ జరుగుతుందని వివరించారు. తొలి, రెండో విడతల్లో వరుసగా 395, 495 గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయని, ఇప్పటివరకు రూ.8.2 కోట్లు సీజ్ చేశామని వివరించారు. పోలింగ్‌కు 50వేల మంది సివిల్ పోలీసులు, 60 ప్లటూన్ల బృందాలు విధుల్లో ఉంటాయని తెలిపారు.