|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 12:54 PM
తెలంగాణ సీఎం కార్యాలయం (సీఎంవో), లోక్ భవన్‌కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపుతోంది. గవర్నర్ కార్యాలయానికి ఖాన్ అనే వ్యక్తి పేరుతో వచ్చిన మెయిల్‌లో, సీఎంవో, లోక్ భవన్‌ను పేల్చేందుకు కుట్ర జరుగుతోందని, వెంటనే ఖాళీ చేయించాలని పేర్కొన్నారు. దీంతో అధికారులు అప్రమత్తమై బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. మరోవైపు, శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. హైదరాబాద్ నుండి అమెరికా వెళ్లే విమానంలో బాంబు ఉందని, మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.