|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 02:27 PM
ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'గోట్ ఇండియా టూర్ 2025'కు సమయం ఆసన్నమైంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మూడు రోజుల పర్యటన కోసం భారత్‌కు రాబోతున్నారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఆయన కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలువురు ప్రముఖులతో సమావేశం కానుండగా, అభిమానులతో ముచ్చటించే కార్యక్రమాలు కూడా ఉన్నాయి.13న కోల్‌కతాలో పర్యటన ముగించుకుని మెస్సీ హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడి రాజీవ్ గాంధీ స్టేడియంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి 7v7 ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం మెస్సీ గౌరవార్థం ఓ సంగీత విభావరిని కూడా ఏర్పాటు చేశారు.