|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 04:12 PM
కామారెడ్డి జిల్లాలో మొదటి విడతలో 167 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 10 గ్రామాలు ఏకగ్రీవం కావడంతో, మిగిలిన 157 గ్రామ పంచాయతీలకు ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. మొత్తం 1533 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, 1457 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. 76 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మొత్తం 2,48,668 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,18,342 మంది పురుషులు, 1,30,322 మంది మహిళలు, 4 మంది ఇతరులు ఉన్నారు.