|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 02:19 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతిష్ఠాత్మక 'గోల్డ్ కార్డ్' పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ పథకం కింద 1 మిలియన్ డాలర్లు చెల్లించే వ్యక్తులకు, లేదా ఒక్కో విదేశీ ఉద్యోగికి 2 మిలియన్ డాలర్లు చెల్లించే కార్పొరేట్ సంస్థలకు అమెరికాలో చట్టబద్ధమైన నివాసం కల్పించి, పౌరసత్వానికి మార్గం సుగమం చేయనున్నారు. ఈ మేరకు దరఖాస్తుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు.వైట్‌హౌస్‌లో బుధవారం వ్యాపార ప్రముఖుల సమావేశంలో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. 1990 నుంచి అమల్లో ఉన్న ఈబీ-5 వీసా స్థానంలో ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా వచ్చే నిధులన్నీ నేరుగా ప్రభుత్వ ఖజానాకు వెళ్తాయని, దేశ ప్రగతికి ఉపయోగిస్తామని ట్రంప్ తెలిపారు. "ఇది గ్రీన్ కార్డ్ లాంటిదే కానీ, దానికంటే చాలా ఉత్తమమైనది, శక్తిమంతమైనది" అని ఆయన తెలిపారు.