|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 08:34 PM
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో విద్యుత్ రంగానికి భారీ పెట్టుబడులు లభించాయి. మొత్తం రూ.3,24,698 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరినట్లు అధికారులు వెల్లడించారు. వీటి ద్వారా సుమారు 1,40,500 ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో జెన్కో, రెడ్కో, సింగరేణి సంస్థలు దేశీయ, అంతర్జాతీయ కంపెనీలతో ముఖ్య అగ్రిమెంట్లు చేసుకున్నాయి. పవర్ సెక్టార్‌లో ఇదొక కీలక పురోగమనంగా అధికారులు పేర్కొన్నారు.