|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 11:44 AM
కామారెడ్డి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా గురువారం మొదటి విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులతో కలిసి పరిశీలించారు. పోలింగ్ సరళితో పాటు, పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు, ఓటర్లకు ఏదైనా ఇబ్బంది ఏర్పడుతుందా అనే విషయాలను వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించి, ఎన్నికల అధికారులకు సలహాలు, సూచనలు అందించారు.