|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 10:32 AM
ఆదిలాబాద్ పట్టణంలోని న్యూహౌసింగ్బోర్డు కాలనీ జోన్ 4లో, మిషన్ భగీరథ మంచినీటి ట్యాంకుపైకి ఎక్కి పిల్లలు గాలిపటాలు ఎగురేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ట్యాంకు మెట్లకు గేటు లేకపోవడంతో పిల్లలు నిత్యం అక్కడ ఆడుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో పిల్లలు గాలిపటాలు ఎగురేయడం ప్రారంభించారు. మైదానాల్లో లేదా భవనాలపై జాగ్రత్తగా ఎగురేయాలని, విద్యుత్ తీగల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.