|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 10:36 AM
TG: నల్గొండ జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. మర్రిగూడ మండలం కొట్టాల గ్రామానికి చెందిన బుర్ర నర్సయ్య రెండో కుమార్తె శ్రుతి(20) జిల్లా కేంద్రంలో హాస్టల్ లో ఉంటూ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అయితే పెళ్లి చేయాలని తల్లిదండ్రులు సంబంధాలు చూస్తుండటంతో పైచదువులు చదువుతానని చెప్పింది. ఈ విషయం మాట్లాడడానికి బుధవారం ఇంటికి రావాలని పేరెంట్స్ చెప్పడంతో చదువు ఆగిపోతుందని మనస్తాపం చెంది మంగళవారం వసతి గృహంలో ఉరి వేసుకుని చనిపోయింది.